లుసానే డైమండ్ లీగ్ బరిలో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ, ఆగస్టు 4 : భారత జావెలిన్ త్రో స్టార్ తర్వాతి ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 21 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక లుసానే డైమండ్ లీగ్ లో బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో నీరజ్ అనుకున్న స్థాయి ప్రదర్శన కనబరచలేదు. స్వర్ణం సాధిస్తాడనుకున్న ఈ స్టార్ అథ్లెట్ రజతంతో సరిపెట్టుకున్నాడు. గ్లాస్గో గేమ్స్‌లో ఫైనల్లో శ్రీలంకకు చెందిన రమేశ్ పతిరాజే 89.75 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిస్తే, నీరజ్ చోప్రా 8.5.83 మీ. మాత్రమే విసరగలిగా డు.
ఇప్పుడు డైమండ్ లీగ్‌లో మరోసారి వీరిద్దరి మధ్యనే గట్టిపోటీ ఉండబోతోంది. ఈ పోటీల్లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమని భావిస్తున్నారు. ప్ర తిష్టాత్మక ఆసియాక్రీడలకు ముందు డైమం డ్ లీగ్ నీరజ్‌కు కీలక పరీక్షగానే చెప్పొచ్చు. వీరితో పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన వాల్కాట్, గ్రెనడా స్టార్ పీటర్స్, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెజ్, జర్మనీ స్టార్ జూలియన్ వెబర్ కూడా బరిలోకి దిగనున్నారు.






