ఉపాధ్యాయ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
28-07-2026 12:27 AM
తాడ్వాయి, జూలై 27 (విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తాడ్వా ఎంఈఓ రామస్వామి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎమ్మార్సి భవనంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు శిక్షణ అనంతరం తమ తమ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. తాడ్వాయి మండలం జిల్లాలోనే ముందుండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, ఆర్ పిలు సంగాగౌడ్, విజయవర్ధన్, ప్రశాంత్, రంజిత్, సి ఆర్ పిలు నరసింహులు, రాజేందర్, రాధా తదితరులు పాల్గొన్నారు.






