డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా ఉండాలి
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 27, (విజయక్రాంతి): మాదకద్రవ్యాలను నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా పోలీసు అధికారులతో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన దర్యాప్తు లో ఉన్న కేసుల పురోగతి పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన దర్యాప్తులో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి,
సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి త్వరితగతిన ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా విచారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.






