30 March, 2026 | 3:31 AM

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

30-03-2026 01:55 AM

కరీంనగర్ క్రైం, మార్చి 29 (విజయ క్రాంతి): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.  పార్టీ జెండాను ఎగురవేసి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో  టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, వాణిజ్య సేల్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లిమిళ్ల కిషన్, వాణిజ్య సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఇట్టే మల్లేశం, పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశం, పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్ కుమార్, నగర మాజి అధ్యక్షులు రొడ్డ శ్రీధర్, బీసీ సెల్ మాజీ అధ్యక్షులు తాటికొండ శేఖర్, దాసరి రామకృష్ణ రెడ్డి, లొంకా భాస్కర్ శర్మ, ఆకుల  కాంతయ్య, వేములరాజేశం, కళ్యాడపు నరేష్, ఎర్రోజు హయాగ్రీవచారి, వెల్మల లక్షమన్ రావు, శ్రీరాముల కిషన్ బాబు, దేశ్ నరేందర్ దత్తు, తదితరులు పాల్గొన్నారు.