30 March, 2026 | 3:27 AM

కిన్నెరసాని ఇసుక దోపిడీ?

30-03-2026 01:54 AM

చెలరేగుతున్న ఇసుక మాఫియా

మామూళ్ల మత్తులో అధికారులు

కలెక్టర్ దృష్టి సారించాలంటున్న ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 29, (విజయక్రాంతి): నిబంధనలను తుంగలోతొక్కి పర్యావరణ పరిరక్షణకు తీవ్ర స్థాయిలో భగ్నం కల్పిస్తూ కిన్నెరసాని పరివాహ ప్రాంతాన్ని లక్ష్యంగా నిర్వహించుకొని ఇసుకాసురులు అక్రమ ఇసుక ఏదేచగా రవాణా సాధిస్తున్న సంబంధిత అధికారులు చోద్యం చూడటంలో అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి. జిల్లాలోని బూర్గంపాడు మండలం ఉప్పు శాఖ పినపాక పట్టి నగర్, పాల్వంచ మండల పరిధిలోని ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత జెసిబిలు, లారీలతో కిన్నెరసాని ఇసుకను తోడేస్తున్నారు.

గుట్టలు గుట్టలుగా ఒక దగ్గర నిల్వచేసి లారీల్లో ఇతర జిల్లాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు చేరవేసిన నిమ్మకు నీరు ఎత్తకుండా వ్యవహరించడంపై అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆ యా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్యలు తాండవిస్తుందని కిన్నెరసాని పరివాహ ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకొని ఆక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, పర్యావరణను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.