చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత
23-06-2026 06:03 PM
చొరవ చూపిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం ముత్తారం మండలం, పోతారం గ్రామానికి చెందిన నీలం రవళి వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.1,50,000 ఎల్.ఓ.సి (మంజూరు చేయించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలం రవళి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించిన మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 1.50 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు చేయించి, ఆ పత్రాలను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. వెంటనే స్పందించి సిఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించిన మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.






