23 June, 2026 | 7:17 PM

Breaking News

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •  

జర్నలిస్ట్ రాఘవేంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

23-06-2026 05:37 PM

* తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన పాపన్నపేట జర్నలిస్టులు

పాపన్నపేట: నార్సింగ్ మండలం మన తెలంగాణ దినపత్రిక విలేకరి రాఘవేందర్‌పై సోమవారం జరిగిన దాడిని పాపన్నపేట మండల విలేకరులు తీవ్రంగా ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తహసిల్దార్ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై దాడులు ఆందోళనకరమని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తల సేకరణలో నిమగ్నమై ఉన్న విలేకరులపై దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.