23 June, 2026 | 7:04 PM

పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ

23-06-2026 05:47 PM

షాద్ నగర్,(విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్  ప్రాజెక్టుల సాధన జేఏసీ లో భాగంగా షాద్ నగర్  పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ కమిటీ ఎన్నికైంది పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ గా మిద్దెల సత్యనారాయణ, కన్వీనర్ గా టీజీ.శ్రీనివాస్, కోఆర్డినేటర్ గా  పవన్ చౌహన్, కో చైర్మన్ లుగా మందారం నర్సింలు, బుద్దుల జంగయ్య, బిజిలి సత్యం, వెంకటేష్ శివ, కో కన్వీనర్లుగా రవీంద్రనాథ్ తిరుమలయ్య అర్జునప్ప రాజు తదితరులు ఎన్నికయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఫేండ్డింగ్ ప్రాజెక్టులతో పాటు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంత రైతాంగానికి సాగు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కమిటీ పని చేస్తుందన్నారు.