23 June, 2026 | 7:17 PM

Breaking News

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •  

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం

23-06-2026 05:42 PM

తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్

తాండూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభిస్తుందని వికారాబాద్ జిల్లా పెద్దముల్ తహసిల్దారు వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని తట్టేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి  మాట్లాడారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని, బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట సర్పంచ్ నారాయణ గౌడ్, గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు, ప్రధానోపాధ్యాయులు జోజప్ప తదితరులు ఉన్నారు