1 May, 2026 | 1:45 AM

మేడ్చల్ 297 డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

01-05-2026 12:18 AM

మేడ్చల్, ఏప్రిల్ 30:(విజయ క్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ 297 డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించడంలో పాస్టర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.

నూతన నాయకత్వం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.బాధ్యతలు స్వీకరించిన వారిలో  అధ్యక్షుడు పాస్టర్ డానియెల్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పాస్టర్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి పాస్టర్ పాల్ రాజ్, సంయుక్త కార్యదర్శి పాస్టర్ ప్రభు స్వామి, ఖజాంచి పాస్టర్ డేవిడ్ రాజ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సలహాదారులు స్థానిక క్రైస్తవ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.