2 July, 2026 | 2:32 AM

ఎస్‌ఐఆర్‌లో బీఎల్‌ఓ వద్ద కాగితాల ఫుల్.. క్షేత్రస్థాయిలో నిల్..!

02-07-2026 01:23 AM

సికింద్రాబాద్, జూలై 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా (SIR) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇచ్చిన బిఎల్‌ఓ ఫోన్ నంబర్లలో చాలా నంబర్లు పనిచేయ డం లేదు. కొన్ని నంబర్లు అసలు అందుబాటులో లేవు. కలిసిన వారు మాత్రం.పర్సనల్ వర్క్  ఉంది.ఇంకో డ్యూటీలో ఉన్నాం. పోలి యో డ్యూటీలో ఉన్నాం.

ఫారమ్స్ ఇంకా రాలేదు. నిదానంగా చేస్తాం. అంటూ సమాధానాలు చెబుతున్నారు. బిఎల్‌ఓ లుఎనూ మరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి తిరిగి సమర్పించాలని అలా చేసినప్పుడే ఓటర్ హక్కు పరిరక్షించ బడుతుంది. ఒకవేళ ఎస్‌ఐఆర్  నిర్వహించే బాధ్యత ఉన్న అధికారులకు ఇప్పటికే ఇతర ప్రభుత్వ విధులు ఉంటే, వారినే బిఎల్‌ఓలుగా ఎందుకు నియమించారు? అంతేకాదు బిఎల్‌ఓ లుగా నియమించిన అధికారులు నిజంగా పని చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించే వ్యవస్థ కూడా కనిపించడం లేదు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. సిటీలో ఒక్కో బూత్కు ఇద్దరు, ముగ్గురు అధికారు లను నియమించి ఉదయం నుంచి రాత్రి వరకు పని చేయిస్తున్నారని సమాచారం వస్తోంది. అదే కంటోన్మెంట్, సికింద్రాబాద్ సనత్ నగర్, కూకట్‌పల్లి, మల్కాజ్గిరి వంటి ప్రాం తాల్లో మాత్రం బిఎల్‌ఓల పనితీరు కనిపించడం లేదు. ఈ తేడాకు కారణం ఏమిటి? పార్టీలు నియమించిన బిఎల్‌ఏ లు సిద్ధంగా ఉన్నారు.ప్రజలు కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉ న్నారు.

కానీ ప్రభుత్వం నియమించిన బిఎల్‌ఓ యంత్రాం గమే క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేయకపోతే ఎస్‌ఐఆర్ ఎలా విజయవంతం అవుతుంది? కాగితాల మీద ప్రగతి నివేదికలు చూపించడం కాదు. ప్రజల గడప వద్దకు వెళ్లి పని చేయడమే అసలైన పరిపాలన. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అలా జరగడం లేదు, ఇది కేవలం పరిపాలనా నిర్లక్ష్యం మాత్రమే కాదు.ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు కలిగించే పరిస్థితి ఏర్పడుతుందని,స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రశ్నలు..

బిఎల్‌ఓలు అందుబాటులో లేకపోతే బా ధ్యత ఎవరిది? ఫోన్ నంబర్లు పనిచేయకపోతే ప్రజలు ఎవరిని సంప్రదించాలి? క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఎందుకు కనిపించడం లేదు? జిల్లాల వారీగా ఒకే విధమైన అమలు ఎందుకు లేదు?

ఎస్‌ఐఆర్ విజయవంతం కావాలంటే...

కాగితాలపై గణాంకాలు కాదు. క్షేత్రస్థాయిలో పనికనిపించాలి. ప్రకటనలు కాదు. జవాబుదారీ తనం కావాలి. నిర్లక్ష్యం కాదు, సమర్థమైన అమలు కావాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి అన్ని వివిధ పార్టీలు,ప్రజలు కోరుకుంటున్నారు.