2 July, 2026 | 1:19 AM

ఇలాంటి సినిమాకు ఫేస్ మేకప్ కన్నా మైండ్ మేకప్ చాలా ముఖ్యం

02-07-2026 12:24 AM

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో, విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రా న్ని సమర్పిస్తున్నారు. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్ర నిర్మించిన ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హీరో సత్యదేవ్ విలేకరలతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

“మొదలుపెట్టినప్పుడు ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాం. మహేశ్‌బాబు కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా అదే మాట చెబుతున్నారు. ఇదంతా మాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకమే. ముఖ్యంగా “ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తే సినిమా ‘రావు బహదూర్’లా ఉంటుంది” అని హీరో -నాని అన్నారు. ఇది కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. -కమల్‌హాసన్, సూర్య, విక్రమ్ ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుం టారు.

అది చూస్తున్నప ్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. ఆ అవకాశం ‘రావు బహదూర్’ రూపంలో వచ్చింది. ఇలాంటి సినిమాకు మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు అలాంటి మైండ్ మేకప్ చాలా చేశా. రోజూ వెళ్లి 16 గంటలు పని చేయాలని ముందే నిర్ణయించున్నా. నా మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. మొన్నటి వరకు నా కెరీర్‌లో ’జ్యోతిలక్ష్మి’కి ముందు, తర్వాత అని చూసుకునేవాడిని.

ఇప్పుడు ‘రావు బహదూర్’కు ముందు, తర్వాత అంటారని చూస్తారని నమ్ముతున్నా. రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఈ సినిమా చూసిన తర్వాత రామప్పలా చేయాలని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏర్పడుతుంది. రామప్ప నన్ను ఆవహిం చాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయా. 

1960-99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు దేశసంచారి. తను అలా సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ భువనాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరం. ఇందులో -యాక్షన్ సీక్వెన్సులు లేవు కానీ, యాక్టింగ్ సీక్వెన్సులున్నాయి. ఈ సినిమా కోసం సాల్సా కూడా నేర్చుకున్నా” అన్నారు.