2 July, 2026 | 2:32 AM

దంచికొట్టిన అభిషేక్, శ్రేయాస్

02-07-2026 01:20 AM

ఇంగ్లాండ్ టూర్‌లో భారత బ్యాటర్ల ఆరంభం అదిరింది. తొలి టీ20లో అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు మెరిపించారు. ఫలితంగా భారత్ భారీస్కోరునే ఇంగ్లాండ్ ముందుంచింది. చివర్లో శివమ్ దూబే మెరుపులు కూడా కలిసొచ్చాయి.ఇంగ్లాండ్ టూర్‌లో భారత బ్యాటర్ల ఆరంభం అదిరింది. తొలి టీ20లో అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు మెరిపించారు. 

  1. 20 బంతుల్లోనే అభిషేక్ ఫిఫ్టీ
  2. అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్
  3. తొలి టీ20లో భారత్ భారీస్కోరు

చెస్టర్ లీ స్ట్రీట్, జూలై 1 : ఈ మ్యా చ్‌లో టాస్ గెలిచిన భారత బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోలేదు. గత మ్యాచ్ కాంబినేషన్‌నే కొనసా గించాలని నిర్ణయించడంతో  వైభవ్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ భారీ ఆరం భం ఇస్తారని ఆశపెట్టుకోగా అది జరగలేదు. సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 1 పరుగుకే ఔటవగా, ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. దీంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు.

కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు శ్రేయాస్ కూడా దంచికొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మ 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి వెనుదిరిగాడు. వీరిద్దరూ 82 పరుగులు జోడించారు. తర్వా త శ్రేయాస్ దూకుడు పెంచాడు. అభిషేక్ ఔటైనా శివమ్ దూబేతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. శ్రే యాస్ 47 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 పరుగులకు ఔటవగా.. చివర్లో శివమ్ దూబే రెచ్చిపోయాడు.  కేవలం 21 బంతు ల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 రన్స్ చేసి నా టౌట్ నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, సామ్ కురాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

స్కోరు బోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 189/7 (శ్రేయాస్ అ య్యర్ 68, అభిషేక్ శర్మ 59, శివమ్ దూబే 42 నాటౌట్, సకీబ్ మహమూద్ 3/33)