1 May, 2026 | 1:46 AM

జన గణనలో మనం ఓ చెయ్యి వేద్దాం..

01-05-2026 12:18 AM
  1. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన 
  2.   33 అంశాలు.. మూడు భాషలు
  3. సామాజిక బాధ్యతగా సమాచారం ఇవ్వాల్సిందే 
  4. డేటా గోప్యాతపై అనుమానాలు వద్దు: కలెక్టర్

నిర్మల్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): దేశంలోని ప్రతి పౌరుడు తమ కుటుంబ వివరాలను ఇందులో నమోదు చేసుకోవాల్సిందే. తాజాగా భారత్ ప్రభుత్వం 2027 జనగణ శ్రీకారం చుట్టడంతో నిర్మల్ జిల్లాలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు జనగణలో భాగమైన స్వీయ గణన లో యజమాని వివరాలు తెలపాల్సింది. ఏప్రిల్ 26 నుంచి మీ 10 వరకు నిర్మల్ జిల్లాలో హౌస్ హోల్డింగ్ సర్వే (స్వీయగణన- 2027) ప్రారంభమయింది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ తో పాటు 400 గ్రామపంచాయతీ లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం జిల్లా యంత్రాంగం జిల్లాలో ప్రతి గ్రామంలో స్వీయ గలన జన గణన కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఆన్లైన్ డేటా సర్వేకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరంతా గ్రామాల్లో తిరిగి స్వీయ గణన లో భాగంగా ఇంటి యజమాని కి సంబంధించిన ఇండ్ల నమోదు తదితర 33 అంశాలను నమోదు చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే ట్యాబ్ మొబైల్ సాంకేతిక టెక్నాలజీ వినియోగించుకున్నారు. 

నిర్మల్ జిల్లాలో 2027 జనగణనలో భాగమైన స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో ఈనెల 26 నుంచి వచ్చే నెల 12 వరకు ఉన్న జాబితా ఇండ్ల గణన (HL O) హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2027 ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే సంవ త్సరం ఫిబ్రవరిలో హౌసింగ్ సర్వే యజమాని ఆధారంగా జనాభా లెక్కలను సేకరించనున్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో స్వీయ గణన కోసం https://secnsus.gov.in వ్బుసైట్ పోర్టర్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

పోర్టల్ ఓపెన్ చేసి తెలంగాణ ఫోన్ నెంబర్ నమోదు చేస్తే స్వీయ  లింక్ ఓపెన్ ఓటిపి వస్తుంది. ఆ నంబర్ ఎంట్రీ చేసి మొదట తెలంగాణ రాష్ట్రం, జిల్లా, మండలము టౌన్, ఎంచుకునే భాష, వివరాలు నమోదు చేయాలి. ముందుగా ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆ ఇల్లు కచ్చా నా పక్కన, ఇటికలతో కూడిందా ఇంటి నిర్మాణ స్వభావం, మరుగుదొడ్లు మూత్రశాలలో ఉన్నాయా, రేడియో టీవీ కార్ సెల్ఫోన్ ఇంటర్నెట్, తదితర అంశాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు ఆన్లైన్ టిక్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ లోకి వెళ్లి మీరు పేర్కొన్న పట్టణం లేదా ఇంటి ఏరియాలో మీ ఇల్లు కు సంబంధించిన మ్యాప్ ను గుర్తించి క్లిక్ చేయాలి.

ఇలా 33 ప్రశ్నల సమాధానాలను అందులో నమోదు చేసి వాటిని స్వయంగా నిర్ధారించుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంటే వెంటనే ఆన్లైన్లో ధ్రువీకరణ చేసుకోవాలి. 33 ప్రశ్నలకు సంబంధించిన జవాబులో ఏవైనా లోపాలు ఉంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లి వాటిని సరైన సమాధానం నమోదు చేసి ఆన్లైన్లో నిర్ధారణ పూర్తి చేయాలి. వెంటనే మీకు 11 నం బర్లతో కూడిన ఎస్‌ఈ ఐడి నంబర్ ఐడి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఎమినేటర్లు సర్వే చేస్తే మీ నంబర్ రాసి ఇవ్వమని చెప్పాలి.

ఆ నంబర్ ఆధారంగానే త్వరలో జరగబోయే జనాభా లెక్క కూడా అది ఉపయోగపడుతుంది. ఈ పక్రియ ప్రభుత్వం నియమించిన ఎమినేటర్ల ద్వారా చేసుకున్న పర్వాలేదు.. ఆ ఇంట్లో ఆ ఊర్లో చదువుకున్న యువకులు మేధావులు సెల్ ఫోన్లో డేటా ప్రక్రియ పూర్తి చేస్తే వారు కూడా జన గణ మన సామాజిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం అందిస్తుంది. అయితే దీనిపై పూర్తి అవగాహన కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపడుతుంది.

ఈ ప్రక్రియ ఆధారంగానే భారత ప్రభుత్వం జనాభా లెక్కలు, కుటుంబాల సంఖ్య, కావలసిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆ గ్రామంలో చేపట్టవలసిన ప్రభుత్వ చర్యలు, బడ్జెట్ కేటాయింపులకు ఇది ప్రామాణికంగా ఉండే అవకాశం ఉన్నందున దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరుతుంది. ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో జనాభా కరుణ కూడా అంతే ముఖ్యమని దీన్ని సామాజిక బాధ్యతగా గుర్తిం చి జనగణలలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ సహకారం అందించి నమోదు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం చెప్తోంది. 

విస్తృత ప్రచారం 

జిల్లాలో జనగణనపై జిల్లా యంత్రాంగం తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం, డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో కరపత్రాలు పుస్తకాలు సోషల్ మీడియా పత్రికలు ద్వారా విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించే విధంగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో చదువుకున్న వ్యక్తులకు స్వీయ గణనపై అవగాహన కల్పించి వారిని సామాజిక బాధ్యతగా వివరాల నమోదులో ఉపయోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసేలా జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత 

2027 జనగణలో భాగమైన స్వీయ గణన లో ప్రతి ఒక్కరు తమ కుటుంబాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఇది కుటుంబ యజమాని సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో స్వీయ గణన ఇమ్యునేటర్ల ప్రతి ఇంటికి వచ్చి ఇంటి యజమాని వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి 11 అంకెల ఐడి నెంబర్ను కేటాయిస్తారు. దీని ఆధారంగానే జనాభా లెక్కలు చేపట్టవలసి ఉంటుంది. కావున అన్ని గ్రామాల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. నిర్మల్ జిల్లాలను రాష్ట్రంలోని ఒక గుర్తింపు జిల్లాగా తీసుకొద్దాం.

 భవిష్ మిశ్రా, కలెక్టర్