25 July, 2026 | 4:24 AM

విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈగా స్వామి బాధ్యతల స్వీకరణ

25-07-2026 01:17 AM

గజ్వేల్, జులై 24: విద్యుత్ శాఖ గజ్వేల్ డీఈ గా ఏ.స్వామి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు గజ్వేల్ లో డీఈ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్.భాను ప్రకాష్ హైదరాబాద్ హబ్సిగూడ విజిలెన్స్ డిఈగా బదిలీ కాగా, సూర్యాపేట సర్కిల్లో విజిలెన్స్ డిఈగా పనిచేసిన ఏ స్వామి గజ్వేల్ కు డీఈ గా బదిలీపై వచ్చారు. గజ్వేల్ డి ఈ గా బాధ్యతలు చేపట్టిన స్వామికి బదిలీపై వెళ్లిన డిఈ భాను ప్రకాష్ తోపాటు ఏడీలు జగదీష్ ఆర్య, శ్రీనివాస్, ఏఈలు  తదితరులు స్వాగతం పలికారు.