డాక్టర్, ఇద్దరు నర్సుల సస్పెన్షన్
ఐదుగురు అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు
నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులు
బాన్సువాడ, జూలై 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిగిన సిజేరియన్ నిర్లక్ష్యం వల్లే ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారని ఉన్నత అధికారుల విచారణలో తేలింది.గత 15 రోజుల క్రితం శుక్ర, శనివారాల్లో చేసిన 10 సిజెరియన్లలో 5గురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారించారు. దీంతో వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు.ఒకేసారి 5గురు బాలింతలు ఒకేలాంటి లక్షణాలతో అస్వస్థతకు గురీకావడంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. కారణాలు కనుగొనేందుకు నిమ్స్కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, డైరెక్టర్ను ప్రిన్సిపల్ సెక్రటరీ బాన్సువాడకు పంపారు.
వారు ఆపరేషన్ థియేటర్, వాడిన పరికరాలు, మందులు, శస్త్రచికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. డిప్యూటేష్ప విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేశారు. వీరిది పిట్లం మండలం. ఆపరేషన్కు మత్తు మందు ఇచ్చిన అనస్థీషియా వైద్యుడిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిజెరియన్ చేసుకున్న హుమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మి ప్రియ, సునీతలను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఆదేశాలతో ఐదుగురికీ ఒకే చోట మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం అందరూ నిమ్స్ ICUలో డయాలసిస్తో పాటు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు.ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ,ఐదుగురూ మహిళలు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఉన్నతాధికారుల విచారణలో నిర్లక్ష్యం తేలడంతో ఇద్దరు నర్సులు, ఒక అనస్థీషియా డాక్ట్ప చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.






