14 May, 2026 | 11:08 AM

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

14-05-2026 09:48 AM

జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడం పోలీసుల ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారి వెంట అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సమావేశంలో డీఎస్పీలు సిఐఎస్ఐలు తదితరులు ఉన్నారు.