14 May, 2026 | 10:41 AM

తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బంది

14-05-2026 09:30 AM

సమయస్ఫూర్తితో  అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం. 

తల్లి, శిశువు క్షేమం

నాగర్‌కర్నూల్, (విజయక్రాంతి): విధి నిర్వహణలో భాగంగా సమయస్ఫూర్తి అనుసరించి తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి 108 సిబ్బంది సాధారణ ప్రసవం చేసి తల్లి బిడ్డలిద్దరినీ కాపాడారు. మండల పరిధిలోని పెద్దాపురం గ్రామానికి చెందిన శ్రీలతకు గురువారం తెల్లవారు జామున (అర్ధరాత్రి) 1:50 నిముషాలకు పురుటి నొప్పులు తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌ ని అశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువయ్యాయి.

దీంతో అంబులెన్స్‌ను పైలట్ శ్రీనివాస్ మధ్యలో ఆపి అత్యవసర పరిస్థితులను గుర్తించిన ఈఏంటీ మల్లికార్జున్ సురక్షితంగా సాధారణ ప్రసవం నిర్వహించారు. శ్రీలత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం పరీక్షల నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించిన అంబులెన్సు సిబ్బంది సేవలను కుటుంబ సభ్యులు అభినందించారు.