7 July, 2026 | 5:16 PM

నర్సింగ్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన

07-07-2026 04:03 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ నితికా పంత్ , అదనపు ఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను విద్యార్థులకు వివరించారు. సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, పోక్సో చట్టం (POCSO Act), బాల్య వివాహ నిరోధక చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని, విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దుష్పరిణామాలపై కూడా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే…