7 July, 2026 | 5:03 PM

ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా

07-07-2026 03:41 PM

 * వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి):  మహర్  కులం వారి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి  పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మహార్ కుల సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మహర్ కుల సంఘం నాయకులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి వారి సమస్యల పట్ల  వినతి పత్రం అందజేశారు. సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే మహర్ కులస్తుల సమస్యను తెలుసుకున్నారు.

* బుద్ధిష్ట్ సొసైటీ వారు తెలిపిన అంశాలు..

గౌతమ బుద్ధిని జన్మదినమైన బుద్ద పౌర్ణమి నాడు సెలవు దినంగా ప్రకటించాలని విన్నవించారు.

వైశాఖ పౌర్ణమి రోజున బుద్ద జయంతిని అధికారికంగా నిర్వహించే విధంగా కృషి చేయాలని కోరారు.

బౌద్ధ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని  ఎమ్మెల్యే కు విన్నవించారు.

సంఘం నాయకులు తెలిపిన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం అని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు రత్నజాడే  ప్రజ్ఞ కుమార్  తో పాటు మహా సంఘం నాయకులు పాల్గొన్నారు.

*40 లక్షలతో వేస్ట్ ప్లాస్టిక్ మ్యానేజ్మెంట్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ..

*వ్యర్థాలను సైతం ఉపయోగపడేలా అధునాతన యంత్రాలు

* వెడ్మ బొజ్జు పటేల్..

 ఉట్నూర్ మండల కేంద్రంలో 40 లక్షలతో వేస్ట్ ప్లాస్టిక్ మ్యానేజ్మెంట్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.వ్యర్థాలను సైతం ఉపయోగపడేలా అధునాతన యంత్రాలు వచ్చాయని,వాటిని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక్కో యూనిట్  కేటాయించామన్నారు.కాంట్రాక్టర్ సయ్యద్ ఇక్బాల్ ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు.పనులు నాణ్యతతో త్వరతిగతిన పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ఉట్నూర్, లక్కారం సర్పంచులు,వార్డ్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.