ఆసుపత్రి ముందు కార్మికుల నిరసన
07-07-2026 04:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రి కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి గేటు వద్ద నిరసన తెలిపిన ఉద్యోగులు వేతనాలు 18000 చెల్లించాలని. ప్రకటించాలని, ఆస్పత్రి చేరిన వారికి వారికి ప్రభుత్వ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రమేష్ ఆరోగ్య కార్మికులు రాజమణి పద్మ పుష్ప జానకి గంగామణి గంగన్న భూమన్న రాజేందర్ తదితరులు ఉన్నారు.






