7 July, 2026 | 4:35 PM

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి

07-07-2026 03:37 PM

కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం

మోతె,(విజయక్రాంతి):  మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో పంట కాలువలను మంగళవారం ఆయన సందర్శించి  రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యాన్ని, ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచాయని, వాటిని సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.అవగాహన అనుభవము లేని నేటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రిపేర్లు, ప్రమాదం జరుగుతుందని కారణం చూపిస్తూ కాలయాపన చేస్తున్నారు. 1983 ఎస్సాఎస్పీ ఫేస్ టు ను  నాటి ముఖ్యమంత్రి తారకరామారావు  శంకుస్థాపన చేస్తే తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కాలువలు తవ్వి గాలికి వదిలేశారు. కాని నీళ్లు మాత్రం వదలలేదు.

2018 తర్వాతనే బిఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్  హయాంలో ఈ ఎస్సార్ఎస్పీ కాలువలో సాగునీరు పారించడం సాధ్యమైనదని, వేసవికాలంలో చెరువులను అలుగు పోపించిన ఘనత కేసిఆర్ కు మాత్రమే దక్కుతుందని కొనియాడారు. ఈరోజు మా త్యాగం వల్లనే దిగుబడి పెరిగిందని జబ్బలు సర్చ్ కునే నాయకులు చరిత్రలు తెలుసుకొని మాట్లాడాలి. కాలేశ్వరం ద్వారా ఎస్సార్ ఎస్పీ నుంచి నుంచి కోదాడ వరకు సాగునీరు తెచ్చింది. బిఆర్ఎస్ ప్రభుత్వం, చెరువులు పునరుద్ధరణ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు వృధాగా నీళ్లు పోతుంటే రైతులకి సాగునీరు అందించే అవగాహన లేని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు

పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నాయకులు రైతులకు ఇబ్బంది కలగకుండా కార్యచరణ చేపట్టాలని, రాజకీయ కక్షసాధింపులతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని, రైతుల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు.