మిత్రుని పుట్టినరోజున ప్రభుత్వ పాఠశాలకు చేయూత
కస్తూర్భా స్కూల్‌కు చేయూతనిచ్చిన దాతలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్
చేవెళ్ల, ఆగస్టు 8 (విజయక్రాంతి): మిత్రు ని పుట్టినరోజు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు గుడుపల్లి శ్రీకాంత్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ స్వంత డబ్బులతో పాఠశాలలో వంటగది,
భవనం ముం దు భాగంకు పెయింటింగ్, బోధనా గదిలో గోడ నిర్మాణం చేపట్టడంతో పాటు విద్యార్థు ల సౌకర్యార్థం కోసం10 ట్యూబ్లైట్లు, 2 సీలిం గ్ ఫ్యాన్లు, 2 టేబుల్ ఫ్యాన్లు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు మున్సిపల్ చై ర్పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి దంపతులకు విద్యార్థులు పూల వర్షం కురిపించి ఘ నస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో దాతల సహ కారం ఎంతో అవసరమని, మరింత మంది ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, కృష్ణానాయక్, జిల్లా ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






