11 August, 2026 | 3:06 AM

హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వెళ్దాం

11-08-2026 01:47 AM

నిర్మల్ ఆగస్టు 10 ( విజయ క్రాంతి)బీసీల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు బి సి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ అన్నారు.సోమవారం నిర్మల్ జి ల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ లో జిల్లా కా ర్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుం చి దేశాన్ని రాష్ట్రాన్ని కేవలం 10 శాతం లేని అగ్రకులాలే పాలిస్తున్నాయని, రాజ్యం, సం పద,పరిశ్రమలు,సినిమా,క్రికెట్ అన్ని వారి దగ్గరనే ఉంచుకొని 90 శాతం ఉన్న బీసీ ఎ స్సీ ఎస్టీలకు బాధలు పెడుతున్నారని అన్నా రు.

గడపగడపకు డాక్టర్ విశారదన్ మహారాజ్ పోరాటాలను, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వి జయాలను తీసుకెళ్లి అగ్రకులాలు చేస్తున్న రాజకీయ,భూ దోపిడిని వివరించాలని మా ర్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కమల్, కార్యదర్శి ల క్ష్మణ్, జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్, కోఆర్డినేటర్ రవీందర్ మహారా జ్, కల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నా రు.జిల్లా కమిటీ ఎన్నిక: బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కమిటీని సోమవారం టీఎన్జీవో ఇస్ కా ర్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేంద్ర ముదిరా జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కమల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ సాగింది. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులుగా యా టకారి సాయన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సొంకేటపోశెట్టి, ప్రధాన కార్యదర్శులుగా మారాజు గంగాధర్,ముధోల్ భూమన్న, జి ల్లా అధికార ప్రతినిధిగా రుద్రవణ వినేష్, న్యాయ సలహాదారులుగా సుంకరి రాజు చా రి, బోడిగం శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా గొడు గు గంగాధర్,ఎండెల గంగన్న, స్వర్ణపేట రా జశేఖర్, మీడియా ఇన్ఛార్జిగా బొజ్జ అశోక్, కార్యదర్శులుగా అలకుంట వెంకటరమణ, కల్లూరు సుధాకర్, సైదు నారాయణ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.