ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
చెపాక్‌లో చెన్నైకి చెక్
హైదరాబాద్ ఆల్‌రౌండ్ షో
ఇషాన్ కిషన్ మెరుపులు
గుజరాత్‌కు కూడా ప్లే ఆఫ్ బెర్త్
ఐపీఎల్ 19వ సీజన్‌లో మరో రెండు జట్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి సన్ రైజర్స్ ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంది. బౌలింగ్‌లో కమిన్స్, బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, క్లాసెన్ మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ గెలుపుతో అటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం 5 జట్లు రేసులో నిలిచాయి.
చెన్నై, మే 18 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచు కుంది. ఫిట్ గా లేకపోవడంతో ధోనీ ఈ మ్యాచ్‌లోనూ ఆడలేదు. చెన్నైకి ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 31 పరుగులు జోడించారు. ఫామ్‌లో ఉన్న సంజూ 13 బంతుల్లో 27 (5 ఫోర్లు, 1 సిక్సర్) ,ఉర్విల్ పటేల్ (13) పరుగులకు ఔటయ్యారు.
ఈ దశలో రుతురాజ్, కార్తీక్ శర్మ 42 పరుగుల భాగస్వా మ్యం నెలకొల్పారు. కార్తీక్ శర్మ 19 బంతుల్లో 32 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. తర్వాత బ్రెవిస్, దూబే ఇన్నిం గ్స్ కొనసాగించారు. వీరిద్ద రూ దూకుడుగా ఆడడంతో స్కోర్ వేగం పుంజుకుంది. బ్రెవిస్ 22 బంతుల్లో 44 (2 ఫోర్లు, 4 సిక్సర్లు) , దూబే (26) పరుగులకు వెనుదిరిగారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. నిజానికి సీఎస్కే దూకుడు చూస్తే 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేసారు.
కమి న్స్ 3, సాకిబ్ హొస్సే న్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో సన్‌రైజ ర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ట్రావిస్ హెడ్ (6) పరుగులకే ఔటయ్యాడు. అయితే మ రో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండోవికెట్‌కు 38 రన్స్ జో డించారు. అభిషేక్ శర్మ (26) వెనుదిరిగినా ఇషాన్ కిషన్, క్లా సెన్ చెలరేగిపోయారు. ఫామ్‌లో ఉన్న వీరిద్దరూ సీఎస్కే బౌలర్ల ను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు.
అటు క్లాసెన్ కూడా తన క్లాసిక్ బ్యాటింగ్‌తో మరోసారి అదరగొట్టాడు. క్లాసెన్ 26 బంతుల్లో 47 ( 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడడంతో లక్ష్యఛేదనలో పెద్ద టెన్షన్ లేకుండా పోయింది. భారీ షాట్లతో సాధించాల్సిన రన్ రేట్ ఒత్తిడి లే కుండా చూసిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 70 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. చివర్లో సలీల్ అరోరా (10), స్మరన్ రవిచంద్రన్ (5) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. గుజరాత్ టైటాన్స్ కూడా ముందంజ వేసింది.
స్కోరు బోర్డు
చెన్నై ఇన్నింగ్స్ : 180/7 ( బ్రెవిస్ 44, కార్తీక్ శర్మ 32, సంజూ 27 ; కమిన్స్ 3/28, సాకిబ్ హొస్సేన్ 2/34 )
హైదరాబాద్ ఇన్నింగ్స్ : 181/5 (ఇషాన్ కిషన్ 70, క్లాసెన్ 47, అభిషేక్ శర్మ 26 ; ముకేశ్ చౌదరి 2/36, అకిల్ 1/21 )






