19 May, 2026 | 2:10 AM

గెలిస్తేనే నిలుస్తారు

19-05-2026 01:03 AM

రాజస్థాన్‌కు డూ ఆర్ డై

ఓడితే ప్లే ఆఫ్స్‌కు కష్టమే

జైపూర్, మే 18: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. జైపూ ర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ప్లే ఆఫ్ రేసు లో వెనుకబడిన రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిస్తేనే ముందంజ వేస్తుంది.

ఒక మ్యాచ్ ఓడినా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ సెకండాఫ్‌లో మాత్రం తడబడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపో యి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత మ్యాచ్‌లో మంచి స్కోరే చేసినా ఢిల్లీ చేతిలో చిత్తు గా ఓడింది. ఢిల్లీ చేతిలో ఇంటా బయటా రెండు చోట్ల పరాజయం పాలైంది.

బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ , జైస్వా ల్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు. జురెల్, రియాన్ పరాగ్ కూడా ఫామ్‌లోకి వచ్చారు. ఢిల్లీపై పరాగ్ విధ్వంసం సృష్టించినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోరు కే పరిమితమైంది. జడేజా, ఫెరీరా చివర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతుండడం ఇబ్బందిగా మారింది. బౌలింగ్‌లో మాత్రం రాజ స్థాన్ మెరుగవ్వాల్సిందే.  మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది.

12 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలోనే గెలిచిన లక్నోకు గత మ్యాచ్‌లో చెన్నైని ఓడించడం కాన్ఫిడెన్స్ పెంచింది. మిఛెల్ మార్ష్  సూపర్ ఫామ్ తో దూసుకెళుతుంచే జోస్ ఇంగ్లీస్, నికోలస్ పూరన్ కూడా టచ్‌లోకి వచ్చారు. అయితే రిషబ్ పంత్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు. కెప్టెన్ గానూ, ఆటగా డిగానూ విఫలమవుతున్న పంత్ ను సీజన్ చివరి రెండు మ్యాచ్‌లోనైనా రాణిస్తాడేమో చూడాలి.

లక్నో బ్యాటింగ్‌లో మార్క్ రమ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్ వంటి యు ఆటగాళ్లు కూడా  ఆకట్టుకుంటున్నా రు. కీలక మ్యాచ్ లలో బ్యాటర్లు ఆడలేకపోతుండడంతోనే వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అటు బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్, షమీ, దిగ్వేశ్ , ఆకాశ్ సింగ్ తో పా టు ప్రిన్స్ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత రికార్డుల విషయానికొస్తే రాజ స్థాన్‌దే పైచేయిగా ఉంది. జైపూర్ పిచ్ బ్యా టింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా.

తది జట్టు అంచనా

రాజస్థాన్ రాయల్స్: జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, రవి బిష్ణో య్, బ్రిజేష్ శర్మ, శనక, తుషార్ దేశ్‌పాండే

లక్నో సూపర్‌జెయింట్స్: మార్ష్, మాక్రరమ్, పంత్(కెప్టెన్), ఇంగ్లీస్, పూరన్, రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మోసిన్ ఖాన్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్