బొల్లారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్
11-05-2026 02:14 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి శిబిరం సమ్మర్ క్యాంప్ మండలంలోని బొల్లారం జడ్పిహెచ్ఎస్ పాఠశాల నందు నిర్వహించడం జరుగుతుందని మండల ఎంఈఓ వెంకటరెడ్డి తెలిపారు.ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు కంప్యూటర్,కుట్టు మిషన్, ఇండోర్ గేమ్స్,మ్యాథమెటిక్స్ పై100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈవో వెంకటరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ బాలాజీ,టీచర్లు సుకుమార్ గౌడ్,వనిత,శంకర్, సిఆర్పిలు రాజయ్య,కృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు.






