15 March, 2026 | 6:51 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా

15-03-2026 05:15 PM

చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆదర్శంగా నిలుపుతానని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆయిల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్ల ను ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ మంద శ్రీనివాస్ గౌడ్, వాకర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు మాదర బోయిన రాజేంద్రప్రసాద్ పలువురు వాకర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో  కృష్ణ మాట్లాడుతూ వాకర్స్ అధ్యక్షులు రమేష్ , వాకర్స్  కోరిక మేరకు ట్రాక్ ఏర్పాటు చేయడం తో పాటు ఇతర సౌకర్యాలు అన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు.