23 May, 2026 | 2:48 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ

15-03-2026 05:23 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత, ప్రజా సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి వారికి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంధం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, వార్డు సభ్యులు గడ్డం లహరి, చౌదరి పద్మ, గంధం లక్ష్మి, గంధం రమేష్, పొన్నాల అమృత, గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మి, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.