సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన
23-05-2026 02:01 PM
బోథ్, మే 23(విజయక్రాంతి): రైతుల నుండి కొనుగోలు చేసిన జొన్నలను తరలించడంలో జాప్యం జరగడానికి నిరసిస్తూ శనివారం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. లారీలు రాకపోవడంతో మార్కెట్ యార్డులోనే ఉన్న సంచులు తడిసిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం సీఈఓ నారాయణ కు వినతిపత్రం అందించారు. కనపడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు కోరారు. కనీసం 12 లారీలను ఏర్పాటు చేసి జోనలను తీసుకువెళ్లాలని రైతుల డిమాండ్ చేశారు. పూకం వేసిన బస్తాలు తీసుకు పోకపోవడంతో తాము రోజు కాపల కాయలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. అధికారులు ఈ విషయంలో రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు






