భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు
15-03-2026 05:10 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో సిబ్బంది, గ్రామపంచాయతీ కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు.
భిక్కనూర్, రామేశ్వర్‌పల్లి, బస్వాపూర్, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, ఇసనపల్లి గ్రామాల్లో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు దివ్య, ఆరోగ్య కార్యకర్తలు శ్యామల, మంజుల, మాధవి, రాజమణి, స్వరూప, హేమలత, యశోద, ఎంఎల్హెచ్‌పీ ప్రశాంత్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




