23 May, 2026 | 1:56 PM

జమ్ని ఊర్లో హైమాస్ట్ లైట్లు మంజూరు

23-05-2026 12:50 PM

 ఎమ్మెల్యే కోవ లక్ష్మి కృషితో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు

జైనురు మే 23 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కృషితో జమ్ని ఊర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ దండారి మందిరం, శ్రీ విఠల్ రుక్మిణి మందిరం ఆవరణల్లో ఎల్ఈడీ హైమాస్ట్ లైట్లు మంజూరయ్యాయి. గ్రామ ప్రజలు, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు కల్పించేందుకు ఈ హైమాస్ట్ లైట్లు ఎంతో ఉపయోగపడతాయని స్థానికులు తెలిపారు.

గ్రామ శోభను పెంచడమే కాకుండా భక్తులకు భద్రత, సౌకర్యం కల్పించే ఈ అభివృద్ధి కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడావి సోంబాయి నాగోరావు, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ ముండే, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మాట్లాడుతూ జమ్ని గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మికి గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.