సుచిర్ ఇండియా 21వ వార్షికోత్సవం
- ఆశా జ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీకి వీల్ చైర్లు తదితర పరికరాల అందజేత
- 75 మంది ప్రత్యేక పిల్లలకు సేవలందిస్తున్న సంస్ధ
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): సుచిరిండియా గ్రూప్ 21వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా గౌరవ కాన్సుల్, సుచిరిండియా గ్రూప్ ఛైర్మన్ లయన్ డాక్టర్ కిరణ్, తమ సిబ్బందితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, హనుమాన్ జంక్షన్‌లోని ౨ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ’ని సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులతో కలిసి కొంత సమయం గడిపారు. దివ్యాంగులకు అండగా నిలవాలనే సుచిరిండియా నిబద్ధతను కొనసాగిస్తూ, డాక్టర్ కిరణ్ ఈ ఎన్జీఓకు సెరిబ్రల్ పాల్సీ కుర్చీ , రెక్లైనర్ వీల్ చైర్, ఇతర ఫిజియోథెరపీ పరికరాలను విరాళంగా అందజేశారు.
ఆశాజ్యోతి హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ బహుళ అంగవైకల్యం ఉన్న సుమారు 75 మంది ప్రత్యేక పిల్లలకు రక్షణ, ఆశ్రయం, సంరక్షణను అందిస్తోంది. సంస్థ చేస్తున్న అంకితభావంతో కూడిన సేవలను డాక్టర్ కిరణ్ అభినందించారు.దివ్యాంగుల సంక్షే మం, సాధికారత కోసం తమ వంతు కృషి చేస్తామని సుచిరిండియా తరఫున ఆయన పునరుద్ఘాటించారు.






