నాయకులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ప్రిన్సిపాల్ భూమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామస్తులందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థినులు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మల్లాపూర్ దేవాలయాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు క్యాతం సురేష్ రెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అరికుప్పల చిన్న రాజం, ఎనుగంటి నరేష్, శనిగారపు లావణ్య–నరేష్, అల్లె లత–చంద్రయ్య, కదుర్క లక్ష్మి–రాజేందర్, ఏనుగు లక్ష్మి–ఏ.వి.ఆర్, వి.డి.సి. ఉపాధ్యక్షులు గంగ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్ల సోమయ్య, నాయకులు పూండ్ర లక్ష్మారెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, ముద్దం శరత్ గౌడ్, బండి లింగస్వామి గౌడ్, మిట్టపల్లి జీవన్ రెడ్డి, డబ్బ రమేష్ రెడ్డి, బుజ్జితల్లి మకిలి రాకేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






