10 March, 2026 | 9:58 PM

విద్యార్థులు క్రీడారంగంలో రాణించాలి

10-03-2026 07:52 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని నేరేడుచర్ల లైన్స్ క్లబ్ అధ్యక్షుడు గుండ్రెడ్డి సైదిరెడ్డి అన్నారు.మంగళవారం మండల పరిధిలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పీఎంజే ఎఫ్ ఏదుల అంజిరెడ్డి ఆర్థిక సహకారంతో 6 వేల విలువగల క్రీడా సామాగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో క్రీడారంగంలో రాణించేందుకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ముప్పాల సువర్ణ,డిస్టిక్ చైర్పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, జిలకర రామస్వామి, కందిబండ శ్రీనివాస్, బాల వెంకటేశ్వర్లు, గంధం శావయ్య పాల్గొన్నారు.