4 May, 2026 | 10:57 PM

సామాన్యుడిలా చాయ్ దుకాణం వద్ద సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

04-05-2026 09:39 PM

దమ్మపేట,(విజయక్రాంతి): రాజకీయాల్లో హంగూ ఆర్భాటాలు పక్కన పెట్టి, సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే ఆ నాయకుడికి అసలైన గౌరవం దక్కుతుందని  అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మరోసారి నిరూపించారు. సోమవారం దమ్మపేట మండలంలోని మందలపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఒక చాయ్ దుకాణం వద్ద ఆగి, స్థానిక గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సరదాగా ముచ్చటించారు.

అందరితో కలిసి కూర్చుని టీ తాగుతూ, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న ఇబ్బందులు, రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. టీ కొట్టు వద్ద జరిగిన ఈ ముచ్చట్లు రాజకీయ చర్చకు వేదికగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళలా  అందుబాటులో ఉంటానని మెచ్చా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థుల ఉన్నారు.