పేదలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది
04-05-2026 09:32 PM
వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రభుత్వ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రజా పాలనలో అర్హులైన పేదలు అందరూ ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంద ని పేదవాడు సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న కుటుంబ యజమానికి పట్టు వస్త్రాలు, నగదును అందజేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య శివుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, ఆలేరు నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు.






