నిఘా నేత్రం.. భద్రతా వలయం..
- 27 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం
- 20 గ్రామాల్లో సుమారు రూ.కోటి ఖర్చుతో ఏర్పాటు
- ఊతంగా నిలిచిన పోలీసులు.. చేయూతనందించిన గ్రామస్తులు
- కోహెడ మండల కేంద్రంలో 30 కెమెరాల ఏర్పాటు
- నేడు ప్రారంభించనున్న సీపీ రష్మీ పెరమాళ్
కోహెడ, మే 4: గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజా భద్రత కోసం నిరంతర నిఘా కల్పనకు, అసాంఘీక కార్యకలాపాలను, నేరాలను త్వరాగ గుర్తించుట కోసం కోహెడ పోలీసులు మండలంలో 20 గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు ఊతం పోశారు.
ఎర్రకుంటపల్లి, బత్తలవానిపల్లి, పొరెడ్డిపల్లి, నాగసముద్రాల, ధర్మసాగర్ పల్లి తదితర గ్రామాలు మినహయించి 27 జీపీలకు గాను ఇరవై జీపీలలో సుమారు రూ.1కోటి నిధుల ఖర్చుతో సిసి కెమెరాల ఏర్పాటు లక్యo గా గ్రామస్తుల చేయూతతో వంద శాతం కార్యచరణ పూర్తి చేసెందుకు పోలీసులు సిద్దమయ్యారు.
రెండేళ్లు నిర్వహణ బాధ్యతపై ఒప్పందం
సిసిటివి కెమెరాల నిర్వహణ బాధ్యతలను సిసి కెమెరాల షాపు నిర్వహకులతో పోలీస్ లు ఒప్పందం చేయించినట్లు తెలిసింది. కోతుల బెడద గ్రామాలలో ఎక్కువగా ఉండటంతో కెమెరాలు పాడైపోవడం ఉంటుం దని.. భద్రత ప్రమాదం తలెత్తకుండ పోలీసులు ముందు చూపుతో ఇట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పటిష్ట భద్రత లక్ష్యంగా సీసీ కెమెరాలు..
ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు, చౌరస్తాలు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ ఆఫీసుల వద్ద భద్రత లక్ష్యంగా సిసి కెమెరాలుఏర్పాటు చేశారు. దీంతో నేరాల గుర్తింపు, సాక్ష్యధారాల సేకరణ సులువు కానుంది.
వీపీఓల పాత్ర కీలకం..
గ్రామాలలో సీసీ కెమోరాల ఏర్పాటు పై విల్లెజ్ పోలీస్ అధికారులు ప్రత్యేక సమవేశాలు ఏర్పాటు చేసి ప్రజలను జాగృతి చేశారు. ఎస్‌ఐ అభిలాష్ సమావేశాలకు హజరైయి సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా కలుగు ప్రయోజనాలను గ్రామస్తులకు అవగహన కల్పించారు. దింతో గ్రామంలోని పెద్దలు, యూవత, స్వచ్చందంగా నిధుల వితరణకు ముందుకోచ్చారు
సమష్టి కృషి ఉంది..
సీసీ టీవీ కె మెరాల ఏర్పాటులో పోలీస్, గ్రామస్తుల సమష్టి కృషి ఉంది. మూడు, నాలుగు నెలల నుంచి గ్రామాలలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు చైతన్యంతో అసరాగా నిలిచారు. భాగస్వా ములైన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు. నిఘానేత్రం నేరరహిత సమాజానికి ఎంతో దోహదపడనుంది.
పుల్లా అభిలాష్, ఎస్‌ఐ, కోహెడ






