4 May, 2026 | 11:19 PM

మద్యం సేవించి వాహనాలు నడపరాదు

04-05-2026 09:46 PM

చందుర్తి,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని చందుర్తి ఎస్సై జె. రమేష్ తెలిపారు . చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... జిల్లా ఎస్పి మహేష్ బి గితే, ఆదేశాల మేరకు, చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడపడం మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఒక ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో భాగంగా, చందుర్తి పోలీసులు 13 మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు, 10 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసులను నమోదు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.