21-02-2026 01:31:37 PM
స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య
ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థులు మెరుగైన సమాజ నిర్మాణం కోసం చిన్నప్పటి నుంచే సమానత్వం, గౌరవం, సహనం వంటి విలువలను అలవరచుకోవాలని, వివక్షను వ్యతిరేకించడం, న్యాయం కోసం నిలబడడం విద్యార్థుల బాధ్యత అని స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య అన్నారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా యాదయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు న్యాయం, సమానత్వం, మానవతా విలువలను పాటిస్తూ మంచి పౌరులుగా ఎదిగితే సమాజంలో శాంతి, ఐక్యత నెలకొంటాయని, ప్రతి విద్యార్థి సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి, ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మీ కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.