calender_icon.png 21 February, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

21-02-2026 01:37:44 PM

  1. కాంగ్రెస్ నాయకునీ కారు దగ్ధం
  2. పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ టు
  3. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. 
  4. కళాశాల ఆస్తుల వ్యవహారంపై కాంగ్రెస్ బిజెపి నాయకుల మధ్య చాలెంజ్ 
  5. ఆధారాలతో నిరూపణకు వచ్చి నామని కాంగ్రెస్ నాయకుల వాదన 
  6. ఎమ్మెల్యేను క్యాంప కార్యాలయంలో గృహనిర్బంధం చేసిన పోలీసులు 
  7. పోలీసుల గృహనిర్బంధం వల్లే ఎమ్మెల్యే రాలేకపోయారు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Kamareddy Government Degree College) ఆస్తుల వ్యవహారంపై బిజెపి కాంగ్రెస్ నాయకుల మధ్య సవాల్ ప్రతి సవాల్ చేసుకున్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి(MLA Ramana Reddy) శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశు మందిర్ కు ఆధారాలతో రావాలని పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కొందరు ఆధారాల తో వచ్చామని ఆందోళన చేపట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి తాడ్వాయి, మాచారెడ్డి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కామారెడ్డిలో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్(Saraswathi Shishu Mandir) వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నీ పోలీసులు  గృహ నిర్బంధం చేశారు. దీంతో  ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే సూచన మేరకు కార్యకర్తలు ఎవరూ క్యాంప్ కార్యాలయం వైపు రాలేదు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సదాశివ నగర్ మండలం

పోసానిపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి  పోలీసుల కళ్లుగప్పి తన కారులో క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. క్యాంప్ ఆఫీసుకు కాంగ్రెస్ నాయకుడు రావడంపై బీజేపీ కార్యకర్తలు , నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ వెళ్లి కారును ఎత్తి పడేశారు. దాంతో స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటికి పోలీసులు కారును టోచన్ సహాయంతో తరలించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు.

మహేందర్ రెడ్డి ఇక్కడికి రావాలని, క్యాంప్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోగా కొందరు కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారుకు నిప్పుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను పక్కకు తరలించి నీళ్లతో మంటలను ఆర్పివేసి కారును తరలించారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు వచ్చి అరెస్ట్ చేసిన తమ కార్యకర్తను పంపించాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు.

బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సూచన మేరకు తాము శాంతియుతంగా ఎలాంటి ఆందోళన చేయకుండా ఉన్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు పోలీసుల కళ్లుగప్పి క్యాంప్ కార్యాలయానికి ఎలా వస్తాడని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా పోలీసుల నిఘా వైఫల్యమేనని ఆరోపించారు. కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి  మాట్లాడుతూ.. క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపును స్వాగతించాడని, ఎమ్మెల్యే సూపర్ అంటూ మెసేజ్ చేశాడని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విడ్డురంగా ఉందన్నారు.