30 June, 2026 | 9:55 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోర్గి మోడల్ స్కూల్ విద్యార్థులు

13-04-2026 12:36 AM

నాగలిగిద్ద, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాగలిగిద్ద మండలం మొరిగి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో 90 మంది విద్యార్థులకు గాను 65 మంది ఉత్తీర్ణత సాధించారు. బైపీసీ గ్రూప్కు చెందిన బిరాధర్ వైష్ణవి 948 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచింది. అదే గ్రూపులో నాగపురి వైష్ణవి 911 మార్కులు, సీఈసీ గ్రూపులో వి.వైష్ణవి 697 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సువర్ణ తెలిపారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 85 మందికి 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ గ్రూప్కు చెందిన జి.స్నేహ 427 మార్కులతో ప్రథమ సంవత్సరంలో కళాశాల టాపర్గా నిలిచింది. బైపీసీ గ్రూప్ జి.కీర్తి, సుప్రియ చెరో 402 మార్కులు సాధించారు. తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 59 శాతం ఉత్తీర్ణత, రెండవ సంవత్సరం 69 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపాల్ ఇంద్రజ వెల్లడించారు. మోర్గి మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.