31 July, 2026 | 4:12 AM

విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి

31-07-2026 12:06 AM

మెనూ షెడ్యూల్ను తప్పనిసరిగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, జులై 30 (విజయక్రాంతి): వసతి గృహాలలోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, తప్పనిసరిగా మెనూ పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్సీ ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో 202627 విద్యా సంవత్సరానికి అమలు చేయనున్న వారాంత ఆహార మెనూ పోస్టర్ను తన ఛాంబర్లో జిల్లా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెనూ షెడ్యూల్ను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతిరోజు నిర్ణయించిన ఆహార పదార్థాలనే విద్యార్థులకు అందించాలని సూచించారు.