శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
27-08-2026 06:16 PM
గట్టు ఆగస్టు 27: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు హాలింపాష పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం గట్టు మండలం చాగదోన గ్రామంలో శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. విద్యార్థులు విద్యారంగంతో పాటు రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాకేష్, వీరేంద్ర, ఉరుకుందు వీరేష్, తదితరులు పాల్గొన్నారు.






