28 August, 2026 | 4:52 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్ఐఆర్ గ్రామసభ

27-08-2026 11:24 PM

మల్దకల్: గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామంలో రెండో విడత ఎస్ఐఆర్ గ్రామసభను సర్పంచ్ పి. వినోద్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై సభలో చర్చించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సర్పంచ్ సూచించారు. గ్రామ సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.