28 August, 2026 | 4:51 AM

ఎస్ఐఆర్ గ్రామసభలు

27-08-2026 11:32 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ డివిజన్ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ రెండో విడత కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో నిర్వహించారు. బిజెపి పార్టీ తరఫున  బీజేపీ సీనియర్ నాయకులు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, బొజ్జా వంశీ రెడ్డి,రాఘవ రెడ్డి, బండి విష్ణు గౌడ్, అవినాష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాను పరిశీలించి, అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు, అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా సర్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించామని వారు తెలిపారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు.