28 August, 2026 | 2:12 AM

22-ఏ భూముల వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

27-08-2026 11:36 PM

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22-ఏ కింద నమోదైన భూ వివరాలను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. భూభారతి డేటాలో 22-ఏ విస్తీర్ణానికి సంబంధించిన తేడాలను పరిష్కరించాలని, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సమగ్ర భూ రీ-సర్వే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఏడి ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.