27 August, 2026 | 10:22 PM

రాజంపేటలో ప్రత్యేక గ్రామ సభ

27-08-2026 06:19 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో భాగంగా రాజంపేట గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఓటరు జాబితా పరిశీలన, ASD ఓటర్ల వివరాలు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాల స్వీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బూరస పోచయ్య సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుల ఫోరం జిల్లా కన్వీనర్ గులాం జావీద్, వార్డు సభ్యులు పోటుపల్లి లావణ్య, జాబరీ కిషోర్, బూరస భూపతి, తిరుశుల ననాయ్య, సిడం మీరా, డాక్టర్ కీర్తి, పంచాయతీ సెక్రటరీ సాయికుమార్, బిల్ కలెక్టర్ నాగేంద్ర, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, జీపీఓ వామన్, బి ఎల్ ఓ లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.