కేంద్ర మంత్రి బండి సంజయ్ సోదరుడి కుమార్తె వివాహం
27-08-2026 11:14 PM
ముకరంపుర,(విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నయ్య బండి శ్రవణ్ కుమార్ - సరిత దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన నూతన వధూవరులు సంజన - రజినీకాంత్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.






