27 August, 2026 | 10:22 PM

బీజేపీ కిసాన్ మోర్చా సెక్రెటరీగా రామినేని అశోక్

27-08-2026 06:16 PM

రైతు సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాడతా

రామినేని అశోక్

గరిడేపల్లి,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కిసాన్ మోర్చా సెక్రెటరీగా గరిడేపల్లి మండలానికి చెందిన రామినేని అశోక్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అధ్యక్షతన ఈ నియామకం జరిగింది.నియామక పత్రాన్ని అందుకున్న రామినేని అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కంచర్ల నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బొబ్బ భాగ్యారెడ్డితో పాటు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.సూర్యాపేట జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతరం పోరాడతానని అశోక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు.

రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ కిసాన్ మోర్చా తరఫున ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు అన్నదాతల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని సెక్రెటరీ రామినేని అశోక్ పేర్కొన్నారు. ఆయన నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గరిడేపల్లి మండల యువత హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.